కేరళలో కరోనా నియంత్రణకు స్పెషల్ కమాండోలు

ABN , First Publish Date - 2020-07-10T17:45:42+05:30 IST

కేరళలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది.

కేరళలో కరోనా నియంత్రణకు స్పెషల్ కమాండోలు

తిరువనంతపురం: కేరళలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కేసుల నియంత్రణకు కేంద్రం కమాండోలను రంగంలోకి దించింది. తిరువనంతపురంలోని పొంతూరులో పాజిటీవ్ కేసులు పెరగడంతో 25 మంది కమాండోలను మోహరించింది. మరోవైపు కేరళలోని హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు రోడ్లపై తిరుగుతుండడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.


దేశంలో ఇతర రాష్ట్రాల కంటే పకడ్బంది ఆరోగ్య వ్యవస్థ ఉన్న కేరళలోనూ ఇప్పుడు కరోనా అదుపు తప్పుతోంది. దీంతో పినరయి విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం జనాలు భౌతికదూరం పాటించకపోవడమే. లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో రోడ్లమీదకు రావడంతో కేసులు పెరుగుతున్నట్లు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు జనాలను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ఏకంగా కమాండోలను రంగంలోకి దించింది.

Updated Date - 2020-07-10T17:45:42+05:30 IST