నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన లోక్ సభ స్పీకర్

ABN , First Publish Date - 2020-03-26T02:03:09+05:30 IST

కరోనాపై పోరు కోసం ప్రధానమంత్రి సహాయ నిధికి తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన లోక్ సభ స్పీకర్

న్యూఢిల్లీ: చాపకింద నీరులా దేశాన్ని కబళిస్తున్న కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వాలు నానాతిప్పలూ పడుతున్నాయి. ఈ క్రమంలోనే లాక్ డౌన్ లు, షట్ డౌన్ లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనాపై పోరు కోసం ప్రధానమంత్రి సహాయ నిధికి తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరం ఒక్కటై కరోనాతో పోరాడాలని ఆయన సూచించారు. కాగా, కరోనాపై పోరులో అహర్నిశలూ శ్రమిస్తున్న ఆరోగ్య, అత్యవసర సేవల సిబ్బందికి సోమవారం పార్లమెంటు కృతజ్ఞతలు తెలిపింది. నేతలంతా లేచి నిలబడి తమ సంఘీభావం తెలిపారు.


Read more