స్పెయిన్‌లో 2 లక్షలు దాటిన కోవిడ్ కేసులు
ABN , First Publish Date - 2020-04-26T03:34:31+05:30 IST
స్పెయిన్‌లో గత 24 గంటల్లో కొత్తగా 2,944 కోవిడ్ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు. శుక్రవారంతో

మాడ్రిడ్: స్పెయిన్‌లో గత 24 గంటల్లో కొత్తగా 2,944 కోవిడ్ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 2,06,000కు పెరిగింది. శుక్రవారంతో పోలిస్తే కేసుల సంఖ్య 1.5 శాతం పెరిగిందని, గత 24 గంటల్లో 378 మరణాలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 23 వేలకు పెరిగినట్టు చెప్పారు. దేశంలో పరిస్థితి రోజురోజుకు మెరుగుపడుతోందని, అయితే, ఎక్కువగా ఆనందించాల్సిన అవసరం లేదని స్పానిష్ ఆరోగ్య మంత్రి ఫెర్నాండో సిమోన్ అన్నారు. ‘‘ఇప్పుడు మనం చాలా వివేకంగా వ్యవహరించాలి. లాక్‌డౌన్ నుంచి బయట పడేందుకు మార్గాలు అన్వేషించాలి. అంతకంటే ముందు మన భద్రతా సామర్థ్యాలకు హామీ ఇవ్వాలి’’ అని ఆయన పేర్కొన్నారు. 14 ఏళ్ల పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి గరిష్టంగా గంటపాటు తమ ఇంటి నుంచి కిలోమీటరు దూరం వరకు తిరిగి రావొచ్చని మంత్రి పేర్కొన్నారు.