స్పెయిన్‌లో మళ్లీ పెరిగిన మరణాలు.. ఈసారి ఎన్నంటే?

ABN , First Publish Date - 2020-04-07T23:46:04+05:30 IST

నాలుగు రోజుల తర్వాత స్పెయిన్‌లో మళ్లీ మరణాల రేటు పెరిగింది. మంగళవారం 743 కరోనా మరణాలు

స్పెయిన్‌లో మళ్లీ పెరిగిన మరణాలు.. ఈసారి ఎన్నంటే?

మాడ్రిడ్: నాలుగు రోజుల తర్వాత స్పెయిన్‌లో మళ్లీ మరణాల రేటు పెరిగింది. మంగళవారం 743 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,798కి పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం దేశంలో 637 మరణాలు  నమోదయ్యాయి. మార్చి 24 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. నాలుగు రోజులపాటు మరణాల్లో తగ్గుదల కనిపించగా, మంగళవారం 5.7 శాతం పెరిగి 743 మరణాలు సంభవించాయి. కేసుల సంఖ్య కూడా పెరిగింది. 4.1 శాతం పెరిగి 1,40,510కి చేరుకున్నాయి. సోమవారంతో పోలిస్తే కేసుల సంఖ్య 3.3 శాతం పెరిగింది. నిజానికి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసర సమన్వయ విభాగానికి చెందిన మరియా జోస్ సియెర్రా పేర్కొన్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరే రోగుల సంఖ్య కూడా తగ్గుతున్నట్టు ఆమె తెలిపారు. గత గురువారం ఒక్క రోజే 950 మంది చనిపోయిన తర్వాతి నుంచి కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది.  

Updated Date - 2020-04-07T23:46:04+05:30 IST