24 గంటల్లో 812 కరోనా మరణాలు..

ABN , First Publish Date - 2020-03-30T21:32:49+05:30 IST

కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 812 మంది...

24 గంటల్లో 812 కరోనా మరణాలు..

మాడ్రిడ్: స్పెయిన్‌లో కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 812 మంది కరోనా బారిన పడి మరణించినట్లు స్పెయిన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. దీంతో.. ఇప్పటివరకూ స్పెయిన్‌లో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 7,340కి చేరింది. స్పెయిన్ ప్రిన్సెస్ మారియా థెరిస్సా కూడా కరోనా సోకి చనిపోయిన సంగతి తెలిసిందే. స్పెయిన్‌లో ఇప్పటివరకూ 85,195 మందికి కరోనా సోకింది. ఇదిలా ఉంటే.. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో వారికి సేవ చేయడం స్పెయిన్‌లోని వైద్యులు, వైద్య సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది.


పైగా.. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిలో చాలా మందికి కరోనా సోకినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిక్కుబిక్కుమంటూ వైద్య సేవలందిస్తున్నామని, తమకు కూడా కుటుంబాలున్నాయన్న సంగతిని ప్రభుత్వం గుర్తించాలని అక్కడి వైద్యులు మొరపెట్టుకుంటున్నారు. తమ నుంచి కుటుంబాలకు కూడా కరోనా సోకుతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది.

Updated Date - 2020-03-30T21:32:49+05:30 IST