హత్రాస్ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ భారీ నిరసన

ABN , First Publish Date - 2020-10-01T20:13:41+05:30 IST

హత్రాస్ జిల్లాలోకి రాకుండా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాధిత కుటుంబాన్ని కలిసేందుకు వారు కాలినడకనే బయల్దేరారు. రాష్ట్రంలో తీవ్ర నిరసనలు పెల్లుబుకడంతో.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార యంత్రాంగం

హత్రాస్ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ భారీ నిరసన

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచారం, హత్యపై సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. వందల సంఖ్యలో కార్యకర్తలు బస్సుల్లో చేరుకుని హత్రాస్ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్‌ గుండా రాజ్‌గా మారిందని యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్పీ కార్యకర్తలను ముందుకు కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల నిర్బంధం నడుమే సమాజ్‌వాదీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.


కాగా, హత్రాస్ జిల్లాలోకి రాకుండా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాధిత కుటుంబాన్ని కలిసేందుకు వారు కాలినడకనే బయల్దేరారు. రాష్ట్రంలో తీవ్ర నిరసనలు పెల్లుబుకడంతో.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. హత్రాస్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు కలెక్టర్ పీకే లక్షకర్ ప్రకటించారు.

Updated Date - 2020-10-01T20:13:41+05:30 IST