ఎస్పీ బాలు ధన్యజీవి: చినజీయర్‌ ఓదార్పు

ABN , First Publish Date - 2020-10-03T08:41:43+05:30 IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మ ణ్యం మృతితో శోకతప్తులైన ఆయన కుటుంబీకులను ఓదార్చుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి ప్రత్యేక సందేశం పంపారు...

ఎస్పీ బాలు ధన్యజీవి: చినజీయర్‌ ఓదార్పు

చెన్నై, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మ ణ్యం మృతితో శోకతప్తులైన ఆయన కుటుంబీకులను ఓదార్చుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి ప్రత్యేక సందేశం పంపారు. ఆ సం దేశాన్ని చెన్నైలోని జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు అధ్యక్షులు రవీంద్రకుమార్‌రెడ్డి ఎస్పీ బాలు కుమార్తె పల్లవికి శుక్రవారం అందజేశారు. సంగీత ప్రపంచానికి తన అనన్య సామాన్యమైన ప్రతిభాపాటవాలతో విశేష కైంకర్యాన్ని అందించి చివరివరకూ సంగీత సాధనలోనే కాలం గడిపి, అకస్మాత్తుగా యావత్‌ ప్రపంచాన్ని శోకసముద్రంలో ముంచి, పరమపదానికి చేరుకున్న శ్రీమాన్‌ బాలసుబ్రహ్మణ్యం ధన్యజీవి అని చినజీయర్‌స్వామి తమ సందేశంలో కీర్తించారు.

Updated Date - 2020-10-03T08:41:43+05:30 IST