నాన్న కోలుకుంటున్నారు
ABN , First Publish Date - 2020-08-16T07:10:13+05:30 IST
‘‘అభిమానుల ఆశీస్సులతో నాన్న నెమ్మదిగా కోలుకుంటున్నారు. వెంటిలేటర్‌పై ఉంచి అందిస్తున్న చికిత్స మంచి ఫలితాన్నిస్తోంది’’ అని గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ అన్నారు...

- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై కుమారుడు చరణ్
చెన్నై, ఆగస్టు 15: ‘‘అభిమానుల ఆశీస్సులతో నాన్న నెమ్మదిగా కోలుకుంటున్నారు. వెంటిలేటర్‌పై ఉంచి అందిస్తున్న చికిత్స మంచి ఫలితాన్నిస్తోంది’’ అని గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ అన్నారు. ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని తాను నమ్ముతున్నానని, ఆయన కోసం ప్రార్థించిన అభిమానులకు థాంక్స్ చెప్పారు. కాగా, ఎస్పీబీ ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని, అత్యవసర చికిత్స కొనసాగుతోందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శనివారానికి ఎస్పీబీ ఆరోగ్యం మెరుగైందని ఆయన మేనల్లుడు, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. కరోనా సోకడంతో ఎస్పీబీ ఈ నెల 5 నుంచి స్థానిక ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.