పాక్, బంగ్లాదేశ్‌లపై దక్షిణ కొరియా ఆంక్షలు

ABN , First Publish Date - 2020-06-22T11:46:12+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో పాకిస్థాన్, బంగ్లాదేశీయులకు వీసాలు ఇవ్వరాదని, ఆయా దేశాల విమానాలకు అనుమతి ఇవ్వరాదని....

పాక్, బంగ్లాదేశ్‌లపై దక్షిణ కొరియా ఆంక్షలు

సీయోల్ (దక్షిణ కొరియా): కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో పాకిస్థాన్, బంగ్లాదేశీయులకు వీసాలు ఇవ్వరాదని, ఆయా దేశాల విమానాలకు అనుమతి ఇవ్వరాదని దక్షిణ కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్, బంగ్లాదేశ్ లకు చెందిన వారికి దక్షిణ కొరియా వచ్చేందుకు వీసాలు ఇవ్వరాదని, ఆయా దేశాల విమానాలను దక్షిణ కొరియాలోకి అనుమతించవద్దని ఆ దేశ సర్కారు నిర్ణయించింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా పాక్, బంగ్లాదేశ్ లపై మంగళవారం నుంచి ఆంక్షలు విధిస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది. దక్షిణ కొరియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-06-22T11:46:12+05:30 IST