దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2020-07-05T08:03:01+05:30 IST

కొన్ని రోజులుగా దేశంలో భారీగా నమోదవుతున్న కరోనా కేసుల్లో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాటానే అధికంగా ఉంటోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా విజృంభణ

గత నాలుగు రోజులుగా అధిక కేసులు


న్యూఢిల్లీ, జూలై 4: కొన్ని రోజులుగా దేశంలో భారీగా నమోదవుతున్న కరోనా కేసుల్లో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాటానే అధికంగా ఉంటోంది. ఈ నాలుగు కూడా దేశంలో అత్యధిక కేసుల రాష్ట్రాల జాబితాలో టాప్‌- 10లో ఉన్నాయి. అంతేకాక, జాబితాలో.. ఈ రాష్ట్రాల్లో మాత్రమే జాతీయ సగటును మించి పాజిటివ్‌లు వస్తున్నాయి. మొదటి స్థానంలో మహారాష్ట్రలో రోజూ అత్యధిక కేసులు రికార్డవుతున్నా.. అక్కడ రోజువారీ వృద్ధి రేటు 3.40 మాత్రమే. కాగా, గత వారం రోజులుగా  తమిళనాడులోనే 28 వేలపైగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, కర్ణాటకల్లో 8 వేలను మించి కేసులొచ్చాయి. రెండ్రోజులుగా ఏపీలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. గత వారం 5,500 కేసులు తేలాయి.  

Updated Date - 2020-07-05T08:03:01+05:30 IST