హిందువులు, సిక్కులకు ‘హలాల్‌’ నిషిద్ధం

ABN , First Publish Date - 2020-12-26T09:23:15+05:30 IST

హలాల్‌ మాంసం హిందువులు, సిక్కులకు నిషిద్ధమని, కాబట్టి రెస్టారెంట్‌ యజమానులు ఏ రకం మాంసం సరఫరా చేస్తున్నారో తమ ఖాతాదారులకు తప్పనిసరిగా తెలియజేయాలని బీజేపీ నేతృత్వంలోని దక్షిణ ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్డీఎంసీ) ప్రతిపాదించింది...

హిందువులు, సిక్కులకు ‘హలాల్‌’ నిషిద్ధం

  • దక్షిణ ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ప్రతిపాదన

న్యూఢిల్లీ, డిసెంబరు 25: హలాల్‌ మాంసం హిందువులు, సిక్కులకు నిషిద్ధమని, కాబట్టి రెస్టారెంట్‌ యజమానులు ఏ రకం మాంసం సరఫరా చేస్తున్నారో తమ ఖాతాదారులకు తప్పనిసరిగా తెలియజేయాలని బీజేపీ నేతృత్వంలోని దక్షిణ ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్డీఎంసీ) ప్రతిపాదించింది. రెస్టారెంట్‌ యజమానులు ఆవిధంగా చేస్తే తాము అందిస్తున్న మాంసం హలాలో కాదో ఖాతాదారులకు తెలుస్తుందని పేర్కొంది. ఎస్డీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఆ ప్రతిపాదనను ఆమోదించింది.  కొనుగోలుదారుడు ఏ రకం మాంసం కొంటున్నాడో అతనికి తెలియజేయడమే తమ ఉద్దేశమని, దీంతో అతను ఓ నిర్ణయం తీసుకోవడానికి వీలు కలుగుతుందని స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రాజ్‌దత్‌ గహ్లోత్‌ అన్నారు.

Updated Date - 2020-12-26T09:23:15+05:30 IST