శబ్ద గరిష్ఠ వేగం సెకనుకు 36 కిలోమీటర్లు!

ABN , First Publish Date - 2020-10-12T08:27:29+05:30 IST

శబ్ద వేగానికి గరిష్ఠ పరిమితిని తాజాగా పరిశోధకులు కనుగొన్నారు. శబ్దం ఒక్కో మాధ్యమంలో ఒక్కో వేగంతో ప్రయాణిస్తుందన్న సంగతి తెలిసిందే. నీటిలో, గాలిలో, వస్తువుల్లో.. ఇలా ప్రయాణించే మాధ్యమం ప్రకారం శబ్ద వేగం మారుతుంటుంది...

శబ్ద గరిష్ఠ వేగం సెకనుకు 36 కిలోమీటర్లు!

  • కనుగొన్న యూకే పరిశోధకులు

లండన్‌, అక్టోబరు 11: శబ్ద వేగానికి గరిష్ఠ పరిమితిని తాజాగా పరిశోధకులు కనుగొన్నారు. శబ్దం ఒక్కో మాధ్యమంలో ఒక్కో వేగంతో ప్రయాణిస్తుందన్న సంగతి తెలిసిందే. నీటిలో, గాలిలో, వస్తువుల్లో.. ఇలా ప్రయాణించే మాధ్యమం ప్రకారం శబ్ద వేగం మారుతుంటుంది. అయితే.. ఈ వేగానికి గరిష్ఠ పరిమితి ఎంత అన్నది ఇప్పటి వరకూ తెలియదు. ఈ నేపథ్యంలో.. దాన్ని కనుగొనేందుకు లండన్‌లోని క్వీన్‌ మేరీ వర్సిటీ, కేంబ్రిడ్జి వర్సిటీ, మాస్కోలోని హై ప్రెజర్‌ ఫిజిక్స్‌ సంస్థలకు చెందిన పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.  అణువు ద్రవ్యరాశి పెరిగితే శబ్ద వేగం తగ్గుతుందన్న అంచనాను రూఢీ చేసుకున్న తర్వాత.. ఘన స్థితిలో ఉన్న అణు హైడ్రోజన్‌లో శబ్దం అత్యంత వేగంతో ప్రయాణిస్తుందని పరిశోధకులు అంచనా వేశారు. ఆ వేగాన్ని అత్యంత ఆధునిక క్వాంటమ్‌-మెకానికల్‌ పద్ధతిలో గణించి, సెకనుకు 36 కిలోమీటర్లుగా ఉందని వారు తేల్చి చెప్పారు.  

Updated Date - 2020-10-12T08:27:29+05:30 IST