నాన్న హత్య కేసు తేల్చండి.. దబోల్కర్ కుమారుడి డిమాండ్..

ABN , First Publish Date - 2020-08-19T03:12:43+05:30 IST

ప్రముఖ హేతువాది, వైద్యుడు, జర్నలిస్టు నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో సీబీఐ విచారణ పూర్తికాకపోవడంపై...

నాన్న హత్య కేసు తేల్చండి.. దబోల్కర్ కుమారుడి డిమాండ్..

పుణే: ప్రముఖ హేతువాది, వైద్యుడు, జర్నలిస్టు నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో సీబీఐ విచారణ ఇంకా పూర్తికాకపోవడంపై ఆయన కుమారుడు హమీద్ దబోల్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన తండ్రి హత్యకు గురై ఏడేళ్లు పూర్తైనా ఇంత వరకు దర్యాప్తు ముగియక పోవడం తమను తీవ్రంగా బాధించిందని ఆయన అన్నారు.  మూఢ నమ్మకాల నిర్మూలనే లక్ష్యంగా ‘మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి’ (ఎంఏఎన్ఎస్)ను స్థాపించిన డాక్టర్ నరేంద్ర దబోల్కర్...  2013 ఆగస్ట్ 20న దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ కేసులో సత్వరం విచారణ పూర్తిచేసి, ప్రధాన సూత్రధారులను అరెస్ట్ చేయాలని దబోల్కర్ కుమారుడు డిమాండ్ చేశారు. ‘‘గురువారం నాటికి నాన్న హత్య జరిగి ఏడేళ్లు పూర్తవుతుంది. ఏడేళ్ల తర్వాత కూడా సీబీఐ లాంటి ఓ ప్రముఖ దర్యాప్తు సంస్థ విచారణ ముగించకపోవడం అత్యంత బాధాకరం. ఇంతకాలం విచారణ జరిపించినా.. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు ఎవరన్నది ఇంకా వెల్లడికాలేదు. వాళ్లు ఎవరన్నది సీబీఐ నిగ్గుతేల్చాలి. లేదంటే రచయితలు, హేతువాదులు, జర్నలిస్టుల వాక్ స్వాతంత్ర్యం ఎప్పటికీ ప్రమాదంలోనే ఉంటుంది...’’ అని హమీద్ దబోల్కర్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-19T03:12:43+05:30 IST