తల్లిదండ్రుల గొడవలో కొడుకు బలి

ABN , First Publish Date - 2020-07-20T07:17:24+05:30 IST

తల్లిపై తండ్రి దాడిని అడ్డుకునేందుకు యత్నించిన ఓ కొడుకు అక్కడికక్కడే మృతిచెందిన దారుణ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కోజికోడ్‌ నగరానికి చెందిన వేణు మద్యం సేవించి భార్యతో గొడవ పడి, దాడికి పాల్పడ్డాడు...

తల్లిదండ్రుల గొడవలో కొడుకు బలి

కోజికోడ్‌, జూలై 19: తల్లిపై తండ్రి దాడిని అడ్డుకునేందుకు యత్నించిన ఓ కొడుకు అక్కడికక్కడే మృతిచెందిన దారుణ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కోజికోడ్‌ నగరానికి చెందిన వేణు మద్యం సేవించి భార్యతో గొడవ పడి, దాడికి పాల్పడ్డాడు. తండ్రిని ఆపేందుకు వారి కొడుకు అలాన్‌(17) అడ్డువెళ్లాడు. ఉన్మాద స్థితిలో ఉన్న వేణు, కొడుకును విసురుగా పక్కకి నెట్టేశాడు. ఆ ఊపులో అలాన్‌ తల తలుపునకు బలంగా తాకింది. తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. 


Updated Date - 2020-07-20T07:17:24+05:30 IST