సాఫ్ట్‌వేర్ ఇంజినీరు మొబైల్ యాప్ ద్వారా మాదకద్రవ్యాల విక్రయం

ABN , First Publish Date - 2020-11-07T18:46:37+05:30 IST

లాక్ డౌన వల్ల ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఇంజినీరు మొబైల్ యాప్ ద్వారా మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న బాగోతాన్ని....

సాఫ్ట్‌వేర్ ఇంజినీరు మొబైల్ యాప్ ద్వారా మాదకద్రవ్యాల విక్రయం

ముంబై (మహారాష్ట్ర): లాక్ డౌన వల్ల ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్  వేర్ ఇంజినీరు మొబైల్ యాప్ ద్వారా మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న బాగోతాన్ని నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో రట్టు చేసింది. సాఫ్ట్ వేర్ ఇంజినీరు అమెరికా నుంచి మాదకద్రవ్యాలను రప్పించి మొబైల్ యాప్ ద్వారా ఇద్దరు వ్యక్తులతో డ్రగ్ ను ముంబైలో విక్రయిస్తున్నాడు.  ముంబైలోని బాండ్రా వద్ద జాతీయ లైబ్రరీ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3000 గ్రాముల డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. యష్ కలానీ, గురు జైస్వాల్ లను అరెస్టు చేసి ప్రశ్నించగా డ్రగ్ రాకెట్ బాగోతం బట్టబయలైంది. యష్ కలానీ సాఫ్ట్ వేర్ ఇంజినీరు అని అతనే యాప్ సాయంతో డ్రగ్ విక్రయిస్తున్నాడని తేలింది. ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో ఈ డ్రగ్ ను విక్రయిస్తున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. 

Updated Date - 2020-11-07T18:46:37+05:30 IST