భౌతిక దూరంతోనే కట్టడి

ABN , First Publish Date - 2020-08-01T08:50:03+05:30 IST

భౌతిక దూరం విధానాన్ని అనుసరించిన దేశాల్లో సామూహిక వ్యాప్తి చెందకుండా

భౌతిక దూరంతోనే కట్టడి

  • 2 వారాల్లో  46 దేశాల్లో 65% కేసుల నియంత్రణ
  • తాజా అధ్యయనంలో వెల్లడి


వాషింగ్టన్‌, జూలై 31: భౌతిక దూరం విధానాన్ని అనుసరించిన దేశాల్లో  సామూహిక వ్యాప్తి చెందకుండా కరోనా వైరస్‌ నియంత్రణలో ఉన్నట్లు  ఒక అధ్యయన బృందం తేల్చింది. ఈ బృందంలో భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త కూడా ఉన్నారు. భౌతిక దూరం తప్పనిసరి చేసిన 46 దేశాల్లో రెండు వారాలపాటు పరిశీలించగా.. సుమారు 1.57 మిలియన్‌ కేసులు అంటే 65ు కేసుల నమోదులో తగ్గుదల నమోదైనట్లు కనుగొన్నారు. భౌతిక దూరం పాటించిన అనేక మంది వైరస్‌ ముప్పు నుంచి బయటపడినట్లు పరిశోధకుల్లో ఒకరైన రఘు కల్లూరి వివరించారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనేక దేశాల్లో సమూహ వ్యాప్తి లేదన్నారు.

Updated Date - 2020-08-01T08:50:03+05:30 IST