మంచుకు దుప్పటి

ABN , First Publish Date - 2020-06-23T07:23:07+05:30 IST

‘మంచు.. దుప్పటిలా దట్టంగా పరుచుకుంది’ అని వర్ణిస్తుంటారు కవులు! కానీ, పెరుగుతున్న భూతాపం దెబ్బకు కరుగుతున్న హిమనీనదాలను కాపాడేందుకు ఇటాలియన్లు మంచుకే దుప్పట్లు (అదేలేండి.. టార్పాలిన్లు) కప్పుతున్నారు...

మంచుకు దుప్పటి

‘మంచు.. దుప్పటిలా దట్టంగా పరుచుకుంది’ అని వర్ణిస్తుంటారు కవులు! కానీ, పెరుగుతున్న భూతాపం దెబ్బకు కరుగుతున్న హిమనీనదాలను కాపాడేందుకు ఇటాలియన్లు మంచుకే దుప్పట్లు (అదేలేండి.. టార్పాలిన్లు) కప్పుతున్నారు. భూతాపం కారణంగా ఇటలీలోని ప్రెసెనా హిమనీనదం కరిగిపోతోంది. 1993 నుంచి ఇప్పటిదాకా మూడొంతులకుపైగా కరిగిపోయింది. కరిగే వేగాన్ని తగ్గించేందుకు 2008 నుంచి ఏటా వేసవిలో ఆ గ్లేసియర్‌పై ఇలా సూర్యకాంతిని ప్రతిఫలింపజేసే తెల్లటి టార్పాలిన్లు కప్పుతున్నారు.  


Read more