‘స్మార్ట్ క్వారంటైన్’ కొవిడ్ చెక్
ABN , First Publish Date - 2020-04-01T06:09:44+05:30 IST
క్వారంటైన్లో ఉన్న వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు చెక్ రిపబ్లిక్ అధికారులు కొత్త ఐటీ వ్యవస్థను పరీక్షిస్తున్నారు. కొవిడ్-19సిజెడ్ అనే కొంత మంది కంప్యూటర్ నిపుణుల...

క్వారంటైన్లో ఉన్న వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు చెక్ రిపబ్లిక్ అధికారులు కొత్త ఐటీ వ్యవస్థను పరీక్షిస్తున్నారు. కొవిడ్-19సిజెడ్ అనే కొంత మంది కంప్యూటర్ నిపుణుల గ్రూపు సహకారంతో ఈ సిస్టమ్‌ను రూపొందిస్తున్నారు. క్వారంటైన్లో ఉన్నవారి మొబైల్ ఫోన్, బ్యాంక్ కార్డుల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా వారు ఎక్కడెక్కడ సంచరించారు? ఎవరిని కలిశారు వంటి అంశాలు గుర్తిస్తారు. ప్రస్తుతం దీనికి ‘స్మార్ట్ క్వారంటైన్ సిస్టమ్’ అని పేరు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ నిపుణులు కూడా ఇదే సూచిస్తున్నారు. కరోనా వైర్‌సబారిన పడ్డవారి ఫోన్లోని గూగుల్ మ్యాప్ ద్వారా వారు ఏయే ప్రాంతాలకు వెళ్లారు, ఎంత సేపు గడిపారు తదితర వివరాలను సేకరించవచ్చని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా తెలిపారు.