ఢిల్లీలో మందకొడిగా సాగుతున్న పోలింగ్
ABN , First Publish Date - 2020-02-08T16:50:13+05:30 IST
రాష్ట్రంలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మంచుకారణంగా ఓటర్లు బయటకు రావడం లేదు.

ఢిల్లీ: రాష్ట్రంలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మంచుకారణంగా ఓటర్లు బయటకు రావడం లేదు. ఉదయం 10 గంటలకు 4శాతం పోలింగ్ మాత్రమే జరిగింది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.