బీహార్ నూతన డీజీపీగా సింఘాల్

ABN , First Publish Date - 2020-12-20T05:27:35+05:30 IST

బీహార్ నూతన డీజీపీగా సింఘాల్

బీహార్ నూతన డీజీపీగా సింఘాల్

పాట్నా: బీహార్ నూతన డీజీపీగా ఆ రాష్ట్ర డీజీ కమ్ కమాండెంట్ జనరల్ ఆఫ్ బీహార్ హోం గార్డ్ అండ్ ఫైర్ సర్వీసెస్‌ ఎస్‌కే సింఘాల్ నియమితులయ్యారు. పంజాబ్‌కి చెందిన సింఘాల్ 1988 బ్యాచ్ బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి. అధికారిక ప్రకటన ప్రకారం ఆయన వచ్చే ఏడాది ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు. కాగా మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే తన పదవీ విరమణ సమయానికంటే ఐదు నెలల ముందే సెప్టెంబర్ 22న రాజీనామా చేశారు. పదవీ విరమణ చేసిన ఐదు రోజులకే ఆయన జేడీయూలో చేరారు. అయితే ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ మాత్రం దక్కలేదు.

Updated Date - 2020-12-20T05:27:35+05:30 IST