ఢిల్లీలో కరోనా అనుమానితులైన ఆరుగురికి టెస్ట్ చేస్తే తేలిందేంటంటే...

ABN , First Publish Date - 2020-03-04T16:22:17+05:30 IST

ఢిల్లీలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇచ్చిన బర్త్‌డే పార్టీకి వెళ్లిన ఆరుగురికి ఢిల్లీలోని వైద్య పరీక్షలు చేయగా...

ఢిల్లీలో కరోనా అనుమానితులైన ఆరుగురికి టెస్ట్ చేస్తే తేలిందేంటంటే...

ఢిల్లీలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇచ్చిన బర్త్‌డే పార్టీకి వెళ్లిన ఆరుగురికి ఢిల్లీలోని వైద్య పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. అయితే.. 14 రోజుల పాటు వారిని అబ్జర్వేషన్‌లో ఉంచుతామని, ఈ రెండు వారాల్లో వైరస్ లక్షణాలు కనిపిస్తే మళ్లీ వారికి పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా మేజిస్ట్రేట్ బీఎన్ సింగ్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుందని తెలిపారు.


కరోనా బారిన పడిన ఢిల్లీవాసి ఇటీవల ఇటలీ దేశానికి వెళ్లి రావడం గమనార్హం. అతడికి ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. అలాగే.. ఇటలీ నుంచి వచ్చి రాజస్థాన్‌లో పర్యటిస్తున్న 69 ఏళ్ల వృద్ధుడికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2020-03-04T16:22:17+05:30 IST