ఆహార వితరణ కార్యక్రమంలో ఘర్షణ.. ఇద్దరు పోలీసుల సహా ఆరుగురి మృతి

ABN , First Publish Date - 2020-05-10T02:57:54+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్‌లో నిర్వహించిన ఫుడ్ డొనేషన్ క్యాంపులో జరిగిన ఘర్షణలో ఇద్దరు

ఆహార వితరణ కార్యక్రమంలో ఘర్షణ.. ఇద్దరు పోలీసుల సహా ఆరుగురి మృతి

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్‌లో నిర్వహించిన ఫుడ్ డొనేషన్ క్యాంపులో జరిగిన ఘర్షణలో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రావిన్షియల్ రాజధాని ఫిరోజ్‌కోలోని గవర్నర్ కార్యాలయం బయట ఖతారి గ్రూప్ సహాయ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో వందలాదిమంది గుమిగూడారు. అయితే, ఈ కార్యక్రమం హింసాత్మకంగా ఎందుకు మారిందన్న విషయం తెలియరాలేదు.


ఆ గుంపులో ఆయుధాలు ధరించిన కొందరు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసులపై కాల్పులు జరిపినట్టు గవర్నర్ అధికార ప్రతినిధి అరెఫ్ హబెర్ తెలిపారు. స్థానిక రేడియో ఉద్యోగి సహా నలుగురు పౌరులు, ఇద్దరు పోలీసులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన తెలిపారు. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.


ఆందోళనకారులు భద్రతా సిబ్బందిపై దాడిచేశారని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్టు ఆయన వివరించారు. ఈ ఘటన షాక్‌కు గురిచేసిందని, ఈ ఘటనపై సీరియస్‌గా దర్యాప్తు జరపుతామని ఆఫ్ఘాన్ ఉపాధ్యక్షుడు అముల్లా సలే తెలిపారు. వెయ్యి మంది స్థానికులకు ఆహారం సరఫరా చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంజాన్ సమయంలో ఇక్కడ ఇలాంటివి సర్వసాధారణం. 

Updated Date - 2020-05-10T02:57:54+05:30 IST