650 మంది తిహార్ జైలు ఖైదీలకు ఎమర్జెన్సీ పెరోల్
ABN , First Publish Date - 2020-04-08T11:07:46+05:30 IST
రోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని తిహార్ జైలులో 650 మంది ఖైదీలకు బుధవారం హైపవర్ కమిటీ ఎమర్జెన్సీ పెరోల్...

న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని తిహార్ జైలులో 650 మంది ఖైదీలకు బుధవారం హైపవర్ కమిటీ ఎమర్జెన్సీ పెరోల్ మంజూరు చేసింది. ఎమర్జెన్సీ పెరోల్ మంజూరు అయిన 650 మంది ఖైదీలను విడుదల చేస్తామని తిహార్ జైలు అధికారులు చెప్పారు. కరోనా ప్రబలుతున్నందున ఇటీవల 823 మంది ఖైదీలను తిహార్ జైలు నుంచి ఇంటీరియం బెయిలుపై విడుదల చేశారు. తిహార్ జైలులో ఖైదీల రద్దీని తగ్గించేందుకు హైపవర్ కమిటీ ఎమర్జెన్సీ పెరోల్ మంజూరు చేసింది.