ఫుట్‌బాల్ ఆడిన కరోనా రోగులు...కేసు నమోదు

ABN , First Publish Date - 2020-07-28T12:35:38+05:30 IST

మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలోని ఐసోలేషన్ సెంటరులో కరోనా రోగులు మాస్కులు ధరించకుండా ఫుట్ బాల్ ఆడిన ఘటన...

ఫుట్‌బాల్ ఆడిన కరోనా రోగులు...కేసు నమోదు

కొల్హాపూర్ (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలోని ఐసోలేషన్ సెంటరులో కరోనా రోగులు మాస్కులు ధరించకుండా ఫుట్ బాల్ ఆడిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరుగురు కరోనా రోగులు కొవిడ్ కేంద్రంలోనే మాస్కులు ధరించకుండా ఫుట్ బాల్ ఆడారు. కరోనా రోగుల ఫుట్ బాల్ ఆడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.కరోనా సంక్షోభ సమయంలో మాస్కులు ధరించకుండా కరోనా రోగులు ఫుట్ బాల్ ఆడటం ఏమిటని కొల్హాపూర్ జిల్లా అధికారులు రోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఫుట్ బాల్ ఆడిన ఆరుగురు కరోనా రోగులపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 3,83,723 కు పెరిగింది. దేశంలో కరోనా వల్ల మృతుల సంఖ్య 32,771 కి పెరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటుంది.

Updated Date - 2020-07-28T12:35:38+05:30 IST