మాస్కులు లేకుండా ఎస్సై, మహిళా కానిస్టేబుల్ చిట్‌చాట్! విషయం పైవారికి తెలిసి..
ABN , First Publish Date - 2020-08-23T00:33:16+05:30 IST
డ్యూటీ సమయంలో మాస్కులు ధరించకుండా పార్కులో బాతాఖానీ పెట్టిన ఆరుగురు బెంగళూరు పోలీసులకు ఊహించని షాక్ తగిలింది.
బెంగళూరు: డ్యూటీ సమయంలో మాస్కులు ధరించకుండా పార్కులో బాతాఖానీ పెట్టిన ఆరుగురు బెంగళూరు పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. విషయంపై అధికారులకు తెలియడంతో వారందరూ సస్పెండ్ అయిపోయారు. సస్పెన్షన్ వేటు పడిన వారిలో ఓ ఎస్సైతో పాటూ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. డ్యూటీలో ఉండగానే భౌతిక దూరం నిబంధనలకు నిళ్లోదిలేసి బాతాఖానీ పెట్టుసుకున్నందుకు పైఅధికారులు ఆ ఆరుగురిపై సీరియస్ అయ్యారని సమాచారం. తీరిగ్గా చిట్‌టాక్ చేస్తున్న వీరందరినీ ఓ సీనియర్ పోలీసు అధికారి గుర్తించి పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారిపై సస్పెషన్ వేటు పడింది.