అర్థరాత్రి పార్టీకి 300 మంది.. ఆరుగురు అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-08T22:36:06+05:30 IST

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 29 అర్థరాత్రి ఈ కార్యక్రమం జరిగింది. కేరళ అంటువ్యాధి చట్టంతో పాటు భారత శిక్షాస్మృతిలోని వివిధ నిబంధనల ప్రకారం జూలై 3న కేసు నమోదైంది. "మేము రిసార్ట్ మేనేజర్‌తో సహా ఆరుగురిని

అర్థరాత్రి పార్టీకి 300 మంది.. ఆరుగురు అరెస్ట్

తిరువనంతపురం: కరోనాపై ప్రభుత్వం విధించిన నిబంధనలను ధిక్కరించి 300 మంది అర్థరాత్రి ఓ పార్టీకి హాజరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఓ ప్రైవేట్ రిసోర్ట్ మానేజర్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేరళలోని హిల్లీ జిల్లాలోని ఉదుంబంచోలలో జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటికి తెలిసిందని పోలీసులు తెలిపారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 29 అర్థరాత్రి ఈ కార్యక్రమం జరిగింది. కేరళ అంటువ్యాధి చట్టంతో పాటు భారత శిక్షాస్మృతిలోని వివిధ నిబంధనల ప్రకారం జూలై 3న కేసు నమోదైంది. "మేము రిసార్ట్ మేనేజర్‌తో సహా ఆరుగురిని అరెస్టు చేశాము. ఈ కేసుకు సబంధించి దర్యాప్తు కొనసాగుతోంది" అని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.

Updated Date - 2020-07-08T22:36:06+05:30 IST