అక్రమ మద్యం అమ్మకాలపై సీఎం కొరడా..

ABN , First Publish Date - 2020-06-06T20:49:10+05:30 IST

దేశవ్యాప్త లాక్‌డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్ 7న డిర్బా నుంచి ధరమ్‌గఢ్‌కు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న 8 మందిని సంగ్రూర్ జిల్లాలో డిర్బా పోలీసులు అరెస్టు ..

అక్రమ మద్యం అమ్మకాలపై సీఎం కొరడా..

ఛండీగఢ్: లాక్‌డౌన్ సమయంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న అక్రమ మద్యం అమ్మకాలు, స్మగ్లింగ్‌పై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొరడా ఝళిపించారు. దీనిపై దర్యాప్తునకు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.


'అక్రమ మద్యం అమ్మకాలు, స్మగ్లింగ్‌‌తో ప్రమేయమున్న వారందరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా సిట్ దర్యాప్తునకు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ ఆదేశించారు' అని సీఎం కార్యాలయం ఒక ట్వీట్‌లో పేర్కొంది. దేశవ్యాప్త లాక్‌డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్ 7న డిర్బా నుంచి ధరమ్‌గఢ్‌కు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న 8 మందిని సంగ్రూర్ జిల్లాలో డిర్బా పోలీసులు అరెస్టు చేశారు. 3,600 బాటిళ్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-06-06T20:49:10+05:30 IST