హాథ్ర్‌సపై సిట్‌ నివేదికకు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-10-08T07:47:50+05:30 IST

హాథ్రస్‌ హత్యాచార ఘటనపై విచారణకు నియమించిన ప్రత్యేక దర్యాప్తుబృందం (సిట్‌) నివేదిక సమర్పించేందుకు యూపీ సర్కారు గడువు పొడిగించింది...

హాథ్ర్‌సపై సిట్‌ నివేదికకు గడువు పెంపు

లఖ్‌నవూ, అక్టోబరు 7: హాథ్రస్‌ హత్యాచార ఘటనపై విచారణకు నియమించిన ప్రత్యేక దర్యాప్తుబృందం (సిట్‌) నివేదిక సమర్పించేందుకు యూపీ సర్కారు గడువు పొడిగించింది. ముగ్గురు సభ్యులతో కూడిన సిట్‌ దర్యాప్తు నివేదిక ఇచ్చేందుకు మరో 10 రోజులు గడువు ఇచ్చింది. హోం శాఖ కార్యదర్శి భగవాన్‌ స్వరూప్‌ నేతృత్వంలో సెప్టెంబరు 30న సిట్‌ ఏర్పాటు చేశారు. తొలుత వారం రోజులే గడువిచ్చారు. తర్వాత సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని మంగళవారం యూపీ సర్కారు న్యాయస్థానానికి తెలిపింది. ఈ క్రమంలో దర్యాప్తు పూర్తి కానందున సిట్‌కు మరో 10 రోజులు గడువిచ్చినట్లు  ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్‌కుమార్‌ అవస్థి తెలిపారు. 

Updated Date - 2020-10-08T07:47:50+05:30 IST