కేరళలో జర్నలిస్ట్ మృతిపై దర్యాప్తునకు సిట్

ABN , First Publish Date - 2020-12-15T14:54:03+05:30 IST

కేరళ రాష్ట్రంలో జర్నలిస్టు ఎస్వీ ప్రదీప్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక పోలీసు బృందాన్ని (సిట్)....

కేరళలో జర్నలిస్ట్ మృతిపై దర్యాప్తునకు సిట్

తిరువనంతపురం (కేరళ): కేరళ రాష్ట్రంలో జర్నలిస్టు ఎస్వీ ప్రదీప్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక పోలీసు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. కరైక్కమండపం సమీపంలోని రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో జర్నలిస్టు ఎస్వీ ప్రదీప్ మరణించారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న జర్నలిస్టు ప్రదీప్ ను వెనుక వస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరా లేదని పోలీసులు చెప్పారు. ద్విచక్రవాహనంపై జర్నలిస్టు వెళుతుండగా వెనుక వచ్చిన వాహనం ఢీకొట్టిందని, ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జర్నలిస్టు ప్రదీప్ ను రోడ్డు ప్రమాద ఘటన అనుమానాస్పదంగా ఉందని, దీనిపై విచారణ జరిపించాలని జర్నలిస్టు సంఘాలు కేరళ డీజీపీకి వినతిపత్రాన్ని సమర్పించాయి. 

Read more