‘జమిలి’పై బీజేపీ వెబినార్‌లు!

ABN , First Publish Date - 2020-12-27T09:10:24+05:30 IST

దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలంటున్న బీజేపీ వివిధ వర్గాల మద్దతు కూడగట్టేందుకు ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’

‘జమిలి’పై బీజేపీ వెబినార్‌లు!

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై అభిప్రాయ సేకరణ 


న్యూఢిల్లీ, డిసెంబరు 26: దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలంటున్న బీజేపీ వివిధ వర్గాల మద్దతు కూడగట్టేందుకు ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ నినాదంతో ఈ నెలాఖరులోగా 25 వెబినార్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో పార్టీ సీనియర్‌ నేతలు, వివిధ సంస్థల సభ్యులు, న్యాయకోవిదులు పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే జమిలి ఎన్నికల అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావిస్తున్నారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతుండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని ఆయన అన్నారు.

Updated Date - 2020-12-27T09:10:24+05:30 IST