గాయని ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు

ABN , First Publish Date - 2020-03-02T15:32:47+05:30 IST

యువగాయని సుశ్మితా(26) ఆత్మహత్య కేసులో భర్త శరత్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచుల వేధింపులు

గాయని ఆత్మహత్య కేసులో భర్త అరెస్టు

బెంగళూరు: యువగాయని సుశ్మితా(26) ఆత్మహత్య కేసులో భర్త శరత్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచుల వేధింపులు తట్టుకోలేక గతనెల 16న సుశ్మితా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న భర్తతోపాటు మరో ఇద్దరిని అన్నపూర్ణేశ్వరీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. భర్త శరత్‌కుమార్‌, అతడి సోదరి గీతా, పెద్దమ్మ వైదేహిలను అరెస్టు చేశారు. ఏడాదిన్నర క్రితం శరత్‌తో సుశ్మితా వివాహం జరిగింది. అదనపు కట్నంతోపాటు పలు విధాలుగా భర్త, సోదరి, అత్తలు వేధిస్తున్నారని, చావుకు వీరి ముగ్గురే కారణమని సుశ్మితా డెత్‌నోట్‌లో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ఈమేరకు మండ్య జిల్లా పాండవపురలో తలదాచుకున్న ముగ్గురినీ అరెస్టు చేశారు. 

Updated Date - 2020-03-02T15:32:47+05:30 IST