క్వారంటైన్ కేంద్రానికి గురుద్వారను ఇచ్చిన సిక్కులు

ABN , First Publish Date - 2020-03-24T00:38:10+05:30 IST

ఈ గురుద్వారలో క్వారంటైన్‌ను సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చని, అందుకు తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు రాసిన లేఖలో వారు పేర్కొన్నారు.

క్వారంటైన్ కేంద్రానికి గురుద్వారను ఇచ్చిన సిక్కులు

న్యూఢిల్లీ: కరోనా (కోవిడ్-19) విజృంభనకు సరైన సదుపాయాలు లేకపోవడం ప్రధాన కారణం. వైద్య సదుపాయాలు, వెంటిలేటర్లు అందుబాటులో లేవు. అంతే కాకుండా కరోనా అనుమానితులను ఉంచడానికి క్వారైంటిన్ కేంద్రాలు కూడా సరిగా లేవు. అయితే దేశ రాజధానిలో ఉన్న గురుద్వారను క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు కోసం ఇస్తున్నట్లు ఢిల్లీ సిఖ్ గురుద్వా మేనేజ్‌మెంట్ కమిటీ ప్రకటించింది. ఈ గురుద్వారలో క్వారంటైన్‌ను సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చని, అందుకు తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు రాసిన లేఖలో వారు పేర్కొన్నారు.


‘‘ప్రభుత్వ సంస్థలకు, ఇతర నిరుపేద సంస్థలకు ఆహారపు ప్యాకెట్లను అందించడానికి గురుద్వార కమిటీ సిద్ధంగా ఉంది. మొత్తం పది లక్షల ఆహారపు ప్యాకెట్లను తక్షణమే ప్రభుత్వానికి పంపిస్తాం. కరోనా అనుమానితులను ఉంచేందుకు గురుద్వార చాలా సురక్షితమైన ప్రాంతం’’ అని గురుద్వార కమిటీ పేర్కొంది.

Updated Date - 2020-03-24T00:38:10+05:30 IST