భర్త అంత్యక్రియలను నాలుగు రోజులు అడ్డుకున్న భార్య... కారణమిదే!

ABN , First Publish Date - 2020-11-19T14:52:10+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని సిద్దార్థ్‌నగర్ జిల్లా ఉస్కా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహరా బజార్ ప్రాంతానికి చెందిన...

భర్త అంత్యక్రియలను నాలుగు రోజులు అడ్డుకున్న భార్య... కారణమిదే!

సిద్దార్థ్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని సిద్దార్థ్‌నగర్ జిల్లా ఉస్కా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహరా బజార్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తన భర్త అంత్యక్రియలను నాలుగు రోజుల పాటు అడ్డుకుంది. తాము ఉంటున్న ఇంటిని తన పేరున రాసిన తరువాతనే భర్తకు అంత్యక్రియలు నిర్వహించాలని పట్టుపట్టింది. నాలుగేళ్ల క్రితం తన భర్త ఈ ఇంటిని విక్రయించాడని, దీనికి సంబంధించన వివాదం కోర్టులో ఉందని, ఆ ఇంటిలో దానిని కబ్జా చేసుకున్నవారు ఉంటున్నారని ఆమె ఆరోపించింది. నాలుగు రోజుల పాటు మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా అలా ఉంచడంతో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది.


ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, పరిపాలనా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు మృతుని భార్య అంజూ జైశ్వాల్‌కు ఈ విషయమై ఎంత నచ్చచెప్పినా ఆమె మాట వినలేదు. ఈ నేపధ్యంలో కొద్దిసేపు వివాదం నడిచిన తరువాత మృతుని సోదరుడు తన అన్న మృతదేహానికి దహనంస్కారాలు చేశారు. మీడియాకు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రెహరా బజార్ ప్రాంతానికి చెందిన గజేంద్ర ప్రసాద్ ఇలీవలే మృతి చెందారు. అతను 2016లో తన ఇంటిని రాజూ ఛపడియాకు విక్రయించాడు. అయితే తన భర్త మానసిక స్థితి సరిగా లేని సమయంలో ఇల్లు విక్రయించాడంటూ గజేంద్ర భార్య కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఇంతలోనే గజేంద్ర మృతి చెందాడు. దీంతో ఆమె తన పేరిట ఆ ఇల్లు రాసేవరకూ భర్త అంత్యక్రియలు చేయవద్దంటూ మొండికేసింది. అయితే ఎట్టకేలకు బంధువులు నచ్చజెప్పడంతో ఆమె భర్త అంత్యక్రియలకు అనుమతిచ్చింది. 


Updated Date - 2020-11-19T14:52:10+05:30 IST