కరోనా ఎఫెక్ట్ : ముంబై సిద్దివినాయక దేవాలయం మూసివేత

ABN , First Publish Date - 2020-03-17T00:18:14+05:30 IST

దేశంలోనే సుప్రసిద్ధమైన ముంబై సిద్దివినాయక దేవాలయాన్ని మూసేస్తున్నట్లు దేవాలయ ట్రస్టు ప్రకటించింది

కరోనా ఎఫెక్ట్ : ముంబై సిద్దివినాయక దేవాలయం మూసివేత

ముంబై : దేశంలోనే సుప్రసిద్ధమైన ముంబై సిద్దివినాయక దేవాలయాన్ని మూసేస్తున్నట్లు దేవాలయ ట్రస్టు ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రతి రోజూ దేవాలయానికి వందల సంఖ్యలో దర్శనార్థం భక్తులు వస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ సోకే ప్రమాదముందని, అందుకే ముందస్తు చర్యలో భాగంగా ఈ నిర్ణయమని వారు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 7 గంటల వరకు తెరిచే ఉంటుందని, ఆ తర్వాత మూసేస్తామని పేర్కొన్నారు. పరిస్థితులు మెరుగైన తర్వాతే తిరిగి దేవాలయాన్ని తెరుస్తామని ప్రకటించారు. కరోనా నేపథ్యంలో భక్తులతో పాటు పూజారులు కూడా మాస్కులు ధరించి దేవాలయంలో పూజలు చేసేవారు. ట్రస్టీ చైర్మన్ ఆదేశ్ బందేకర్ మాట్లాడుతూ... ‘‘పరిస్థితులు చక్కబడే వరకు ముందస్తు చర్యలో భాగంగా దేవాలయాన్ని మూసేయాలని ట్రస్టు నిర్ణయం తీసుకుంది’’ అని బందేకర్ అన్నారు. 

Updated Date - 2020-03-17T00:18:14+05:30 IST