ముంబై నుంచి వ‌చ్చి క్వారంటైన్ సెంట‌ర్‌లో వ్య‌క్తి మృతి

ABN , First Publish Date - 2020-05-18T11:35:55+05:30 IST

యూపీలోని సిద్ధార్థనగర్ జిల్లాలో గ‌ల‌ త్రిలోక్‌పూర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని డోకంఅమయ గ్రామానికి చెందిన‌ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో క్వారంటైన్ సెంట‌ర్‌లో మృతిచెందాడు. మృతుడు...

ముంబై నుంచి వ‌చ్చి క్వారంటైన్ సెంట‌ర్‌లో వ్య‌క్తి మృతి

సిద్ధార్థనగర్: యూపీలోని సిద్ధార్థనగర్ జిల్లాలో గ‌ల‌ త్రిలోక్‌పూర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని డోకంఅమయ గ్రామానికి చెందిన‌ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో క్వారంటైన్ సెంట‌ర్‌లో మృతిచెందాడు. మృతుడు ఆరు రోజుల క్రితం ముంబై నుండి వచ్చాడు. ఆ వ్య‌క్తి మృతదేహాన్ని అత‌ని కుటుంబీకులు పోలీసుల సమక్షంలో ఖననం చేశారు. కాగా ఈ వార్త‌ తెలిసిన వెంటనే గ్రామస్తులు తీవ్ర ఆందోళ‌న‌కు లోన‌య్యారు. డోకం అమయ గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ముంబైలో ఉంటూ ఉపాధి పొందుతున్నాడు. ఆరు రోజుల క్రితం ముంబై నుండి గ్రామానికి తిరిగి వచ్చాడు. దీనిని గ్రామస్తులు గ‌మ‌నించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అత‌నిని ప్రాథమిక పాఠశాలలో క్వారంటైన్‌లో ఉంచారు. ఈ నేప‌ధ్యంలో అత‌ని ఆరోగ్యం దిగ‌జార‌డంతో భన్వాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించి, తిరిగి క్వారంటైన్‌లో ఉంచారు. ఇంత‌లో అత‌ను మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసుల సమక్షంలో గ్రామ శ్మశానవాటికలో ఖననం చేశారు. రెండు రోజుల క్రితం అత‌ని ఆరోగ్యం క్షీణించిందని సిఎంఓ డాక్టర్ సీమా రాయ్ చెప్పారు. 

Updated Date - 2020-05-18T11:35:55+05:30 IST