పుట్టినరోజునే కరోనాను జయించిన మాజీ సీఎం

ABN , First Publish Date - 2020-08-13T00:18:22+05:30 IST

ఈరోజు ఆయన 72వ పడిలోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆయన.. 2013-2018లో ప్రభుత్వాన్ని నడిపారు

పుట్టినరోజునే కరోనాను జయించిన మాజీ సీఎం

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య.. కోవిడ్19 నుంచి కోలుకున్నారు. అయితే ఇందులో మరో విశేషం ఏంటంటే ఈరోజు ఆయన పుట్టిన రోజు. కొద్ది రోజులుగా కరోనా చికిత్స తీసుకుంటున్న ఆయన సరిగ్గా పుట్టిన రోజు నాటికి వ్యాధి నుంచి కోలుకున్నారు. గురువారం(ఆగస్టు 13)న ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.


ఈరోజు ఆయన 72వ పడిలోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆయన.. 2013-2018లో ప్రభుత్వాన్ని నడిపారు. కర్ణాటకలో పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని నడిపిన అతికొద్ది మందిలో సిద్ధరామాయ్య ఒకరు.

Updated Date - 2020-08-13T00:18:22+05:30 IST