కూలీల లభ్యతే అతిపెద్ద సవాలు: ఎస్‌ఐఏఎం

ABN , First Publish Date - 2020-04-18T09:24:35+05:30 IST

ఈనెల 20 నుంచి ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభానికి కూలీల లభ్యత అతిపెద్ద సవాలుగా మారిందని భారత ఆటోమొబైల్‌ తయారీదారుల

కూలీల లభ్యతే అతిపెద్ద సవాలు: ఎస్‌ఐఏఎం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17 : ఈనెల 20 నుంచి ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభానికి కూలీల లభ్యత అతిపెద్ద సవాలుగా మారిందని భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (ఎస్‌ఐఏఎం) పేర్కొంది. అమ్మకాల నెట్‌వర్క్‌ బంద్‌కావడం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ సమగ్ర రక్షణ ప్రోటోకాల్‌తో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి పరిశ్రమ సిద్ధమవుతోందని ఎస్‌ఐఏఎం అధ్యక్షుడు రాజన్‌ వాధేరా ఓ ప్రకటనలో చెప్పారు. ఈనెల 20 నుంచి కార్యకలాపాలను తిరిగి ఏవిధంగా ప్రారంభించాలన్న విషయంపై తమ తయారీదారులు వారివారి జిల్లా, రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నారని వాధేరా తెలిపారు.

Updated Date - 2020-04-18T09:24:35+05:30 IST