‘శుక్రయాన్‌’కు స్వీడన్‌ ఓకే

ABN , First Publish Date - 2020-11-26T07:10:08+05:30 IST

శుక్ర గ్రహంపై పరిశో ధనల కోసం ఇస్రో చేపట్టనున్న ‘శుక్రయాన్‌’ మిషన్‌ లో పాల్గొనేందుకు స్వీడన్‌ ముందుకొచ్చింది. వీనస్‌ ఆర్బిటర్‌లో తమ పేలోడ్‌ను పంపాలని కోరింది. ఈ ప్రాజెక్టుపై ఇస్రోతో కలసి పనిచేయడానికి స్వీడిష్‌

‘శుక్రయాన్‌’కు స్వీడన్‌ ఓకే

బెంగళూరు, నవంబరు 25: శుక్ర గ్రహంపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టనున్న ‘శుక్రయాన్‌’ మిషన్‌ లో పాల్గొనేందుకు స్వీడన్‌ ముందుకొచ్చింది. వీనస్‌ ఆర్బిటర్‌లో తమ పేలోడ్‌ను పంపాలని కోరింది. ఈ ప్రాజెక్టుపై ఇస్రోతో కలసి పనిచేయడానికి స్వీడిష్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ ఫిజిక్స్‌(ఐఆర్‌ఎఫ్‌) సిద్ధంగా ఉందని స్వీడన్‌ రాయబారి క్లాస్‌ మోలిన్‌ ప్రకటించా రు. ఐఆర్‌ఎఫ్‌ రూపొందించిన వీనసియన్‌ న్యూట్రల్స్‌ అనలైజర్‌ (వీఎన్‌ఏ) పేలోడ్‌ను వీనస్‌ ఆర్బిటర్‌లో పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. 

Updated Date - 2020-11-26T07:10:08+05:30 IST