‘రాఫెల్‌’లో శ్రీసిటీ భాగస్వామ్యం

ABN , First Publish Date - 2020-09-12T08:02:01+05:30 IST

రాఫెల్‌ యుద్ధ విమాన ప్రాజెక్టులో చిత్తూరు- నెల్లూరు జిల్లాల పరిధిలోని శ్రీసిటీకి చెందిన రెండు పరిశ్రమలు భాగస్వామ్యమయ్యాయి.

‘రాఫెల్‌’లో శ్రీసిటీ భాగస్వామ్యం

ప్రాజెక్టుకు సెజ్‌లో 2 పరిశ్రమల సహకారం 

సత్యవేడు/తడ, సెప్టెంబరు 11: రాఫెల్‌ యుద్ధ విమాన ప్రాజెక్టులో చిత్తూరు- నెల్లూరు జిల్లాల పరిధిలోని శ్రీసిటీకి చెందిన రెండు పరిశ్రమలు భాగస్వామ్యమయ్యాయి. పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరంలో రాఫెల్‌ యుద్ధ వి మానాలు కొలువుతీరే సర్వీస్‌ హేంగర్‌ కోసం ‘లుక్సలోన్‌ 300సీ’ లీనియర్‌ మెటల్‌ పైకప్పు(ఫాల్స్‌ సీలింగ్‌)ను ఈ సెజ్‌లోని హంటర్‌ డగ్లస్‌ ఇండియా పరిశ్రమ విజయవంతంగా సరఫరా చేసింది. ఇక సిద్ధార్థ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తన ఆధునిక గిడ్డంగిలో దసో ఏవియేషన్‌కు చెందిన పలు విడిభాగాలనుభద్రపరిచి అవసరాల మేరకు సరఫరా చేస్తోం ది. రాఫెల్‌ ప్రాజెక్టులో తమ సెజ్‌కు సంబంధించిన రెండు పరిశ్రమలు భాగస్వామ్యం కావడంపై గర్విస్తున్నామంటూ శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-12T08:02:01+05:30 IST