10, 12వ తరగతి పరీక్షల రద్దును పరిశీలించండి: సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2020-06-18T07:08:34+05:30 IST

మిగిలిపోయిన 10, 12వ తరగతి పరీక్షలను రద్దు అవకాశాలను పరిశీలించాలని సెంట్రల్‌ బోర్డ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ ఈ) బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది...

10, 12వ తరగతి పరీక్షల రద్దును పరిశీలించండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జూన్‌ 17: మిగిలిపోయిన 10, 12వ తరగతి పరీక్షలను రద్దు అవకాశాలను పరిశీలించాలని సెంట్రల్‌ బోర్డ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ ఈ) బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. మిగిలిపోయిన పరీక్షలను జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించాలని సీబీఎ్‌సఈ ఇంతకుముందు నిర్ణయించింది. కరోనా ప్రబలంగా ఉన్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారవచ్చని, కాబట్టి పరీక్షలను రద్దుచేసేలా సీబీఎ్‌సఈని ఆదేశించాలని కోరుతూ ఓ తండ్రి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 23 లోగా నిర్ణయాన్ని తెలపాలని జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బోర్డును ఆదేశించింది.


Updated Date - 2020-06-18T07:08:34+05:30 IST