తమిళనాడులో రాత్రి 10 గంటల వరకు దుణాలకు అనుమతి
ABN , First Publish Date - 2020-10-21T22:38:50+05:30 IST
తమిళనాడులో రాత్రి 10 గంటల వరకు దుణాలకు అనుమతి

చెన్నై: కరోనా వైరస్ లాక్ డౌన్ అన్లాక్ 5.0 ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇవ్వడంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో షాపులు, వాణిజ్య సంస్థలు అక్టోబర్ 22 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించారు.
పరిశ్రమలోని ఉన్నత స్థాయి కమిటీ అధికారులను జనరల్ సెక్రటేరియట్లో కలిసిన తరువాత తమిళనాడు సీఎం ఎడప్పాడి కే పళనిస్వామి ఈ విషయాన్ని ప్రకటించారు. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న దుకాణాలకు వర్తిస్తుందని పేర్కొంది.