షాపింగ్ మాల్స్‌లోకి పరిమితంగా అనుమతి
ABN , First Publish Date - 2020-03-25T08:08:45+05:30 IST
లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసరాలను మాత్రమే విక్రయిస్తున్న రియలన్స్ ఫ్రెష్, మోర్, వాల్‌మార్ట్, క్యాష్ అండ్ క్యారీ తదితర రిటైల్ స్టోర్స్ యాజమాన్యాలు మరిన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాయి. స్టోర్స్‌లోకి పరిమిత...

న్యూఢిల్లీ, మార్చి 24: లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసరాలను మాత్రమే విక్రయిస్తున్న రియలన్స్ ఫ్రెష్, మోర్, వాల్‌మార్ట్, క్యాష్ అండ్ క్యారీ తదితర రిటైల్ స్టోర్స్ యాజమాన్యాలు మరిన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాయి. స్టోర్స్‌లోకి పరిమిత సంఖ్యలో వినియోగదారులను అనుమతిస్తూ సామాజిక దూరం నిబంధనను అమలు చేస్తున్నాయి. ఒకరు కొనుగోళ్లు పూర్తి చేసి బయటకు వచ్చిన తరువాతే మరొకరిని పంపుతున్నారు. స్ర్కీనింగ్ చేయడంతో పాటు చేతులను శానిటైజ్ చేసి మరీ లోపలికి అనుమతిస్తున్నారు. బిల్లింగ్ కౌంటర్ వద్ద గుంపుగా నిలబడకుండా టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు మెట్రో క్యాష్ అండ్ క్యారీ యాజమాన్యం తెలిపింది. ఫ్యూచర్, డీమార్ట్, వాల్‌మార్ట్ స్టోర్ల వద్ద సామాజిక దూరం పాటించేందుకు ప్రత్యేకంగా లైన్లను మార్క్ చేశారు. శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీలు దాటి ఉన్న వారిని వెనక్కి తిప్పి పంపుతున్నారు.