ఆ బ్యాంకుల కస్టమర్లకు షాక్... ఆగస్టు ఒకటి నుంచి అదనపు భారం

ABN , First Publish Date - 2020-07-20T01:55:51+05:30 IST

మినిమం బ్యాలెన్స్, క్యాష్ ఉపసంహరణలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకులు ఆగస్ట్ ఒకటి నుంచి కొత్త ఛార్జీలను వసూలు చేయనున్నాయి. వచ్చే నెల నుండి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మినిమం బ్యాలెన్స్ నిబంధనలు మారుతున్నాయి. వివిధ ప్రయివేటు బ్యాంకులు కూడా నిబంధనలు, ఛార్జీల్లో మార్పులు చేస్తున్నాయి.

ఆ బ్యాంకుల కస్టమర్లకు షాక్... ఆగస్టు ఒకటి నుంచి అదనపు భారం

ముంబై : మినిమం బ్యాలెన్స్, క్యాష్ ఉపసంహరణలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకులు ఆగస్ట్ ఒకటి నుంచి కొత్త ఛార్జీలను వసూలు చేయనున్నాయి. వచ్చే నెల నుండి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మినిమం బ్యాలెన్స్ నిబంధనలు మారుతున్నాయి. వివిధ ప్రయివేటు బ్యాంకులు కూడా నిబంధనలు, ఛార్జీల్లో మార్పులు చేస్తున్నాయి. 


బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర :  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతాదారు అకౌంట్లలో ఇక నుండి రూ. రెండు వేలు మినిమం బ్యాలెన్స్ ఉండాలి. అంతకుముందు ఇది రూ. 1,500 గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,500 ఉండాలి. బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్లలో కొత్త రూల్స్ మేరకు మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయకుంటే రూ. 20 నుండి రూ. 75 వరకు ఛార్జీలు విధిస్తారు. మెట్రోల్లో గరిష్ట ఫైన్ రూ. 75, అర్బన్ బ్రాంచీల్లో రూ. 50, గ్రామీణ బ్రాంచీల్లో రూ. 20 ఫైన్ విధిస్తారు. కరెంట్ అకౌంట్ హోల్డర్ యావరేజ్ బ్యాలెన్స్ రూ. ఐదు వేలు ఉండాలి. 


క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు... బ్యాంకుకు వెళ్లి క్యాష్ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తే కూడా ఛార్జీలు వసూలు చేయనున్నారు. తొలి మూడు లావాదేవీలు ఉచితం. ఆ తర్వాతి లావాదేవీలకు... డబ్బు విత్ డ్రా చేయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా రూ. వంద వరకు క్యాష్ హ్యాండ్లింగ్ ఫీజు ఉంటుంది. అదే సమయంలో లాకర్ డిపాజిట్‌ను తగ్గించారు. అలాగే లాకర్ రెంట్ ఎరియర్స్ పెనాల్టీని పెంచింది. 


యాక్సిస్ బ్యాంకు : ఈసీఎస్ ట్రాన్సాక్షన్‌పై రూ. 25 వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు ఇది జీరోగా ఉంది. పరిమితిని మించితే లాకర్‌కు ఛార్జీలను ఇంట్రడ్యూస్ చేయనుంది. 


కొటక్ మహీంద్రా బ్యాంకు : ఐదు ఉచిత డెబిట్ కార్డు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అనంతరం ప్రతి లావాదేవీకి రూ. 20 ఛార్జ్ చేయనుంది. క్యాష్ విత్‌డ్రాయల్‌పై ఈ మొత్తం వసూలు చేస్తుంది. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు రూ. 8.50 ఛార్జ్ చేస్తుంది. సరైన బ్యాలెన్స్ లేని ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ పైన రూ. 25 వసూలు చేయనుంది. యావరేజ్ మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయకుంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది అకౌంట్ కేటగిరీని బట్టి ఉంది. ప్రతి నాలుగో క్యాష్ ట్రాన్సాక్షన్ పైన రూ. 100 ఛార్జీ వసూలు చేస్తుంది.


Updated Date - 2020-07-20T01:55:51+05:30 IST