సోనియా గాంధీ కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2020-07-08T21:47:23+05:30 IST

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. గాంధీ కుటుంబానికి చెందిన ఛారిటబుల్ ట్రస్టులపై విచారణకు కేంద్ర హోం శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా... ఆదాయపు పన్ను చట్టంతోపాటు ఎఫ్‌సీఆర్‌ఏ, పీఎంఎల్‌ఏ చట్టాలను రాజీవ్ గాంధీ, ఫౌండేషన్, రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఉల్లంఘించాయన్న ఆరోపణలున్నాయి.

సోనియా గాంధీ కుటుంబానికి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ : ఛారిటబుల్ ట్రస్టులకు సంబంధించిన చట్టాల ఉల్లంఘన కేసుల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. గాంధీ కుటుంబానికి చెందిన ఈ ట్రస్టుల వ్యవహారంలో  కేంద్ర హోం శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా... ఆదాయపు పన్ను చట్టంతోపాటు ఎఫ్‌సీఆర్‌ఏ, పీఎంఎల్‌ఏ చట్టాలను రాజీవ్ గాంధీ, ఫౌండేషన్, రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఉల్లంఘించాయన్న ఆరోపణలున్నాయి.


చైనా నుంచి ఆ సంస్థలకు నిధులొచ్చాయంటూ భారతీయ జనతా పార్టీ సైతం తారస్థాయిలో ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే... ఆ ట్రస్టుల లావాదేవీలపై విచారణకుగాను... ఓ ఉన్నతస్థాయి కమిటీని కేంద్ర హోం శాఖ నియమించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు చెందిన స్పెషల్ డైరెక్టర్ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. 

Updated Date - 2020-07-08T21:47:23+05:30 IST