రాందేవ్ బాబాను కాపీ కొట్టిన షోయబ్ అఖ్తర్

ABN , First Publish Date - 2020-03-26T17:46:35+05:30 IST

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కరోనా వైరస్ ను ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ వీడియోల ద్వారా జీవనశైలిని మార్చుకోవాలని అన్నారు.

రాందేవ్ బాబాను కాపీ కొట్టిన షోయబ్ అఖ్తర్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కరోనా  వైరస్ ను  ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ వీడియోల ద్వారా జీవనశైలిని మార్చుకోవాలని అన్నారు. మంచి ఆహారం, పానీయాలను తీసుకోవాలని సూచించారు. తద్వారా వ్యాధులపై పోరాడటానికి వారి శారీరక బలం సమకూరుతుందని అన్నారు. షోయబ్ అక్తర్ సలహా విన్న వారికి బాబా రామ్‌దేవ్‌ గుర్తుకు వచ్చారు. తన ఊపిరితిత్తులు బలంగా ఉండటానికి, శరీరంలో వ్యాధులపై పోరాడే బలం సమకూరేందుకు మైదానంలో పరిగెడతానని షోయబ్ చెప్పాడు. చాలామంది క్యారెట్లు, ముల్లంగి, కూరగాయలు తినేందుకు ఇష్టపడరని అన్నారు. రెస్టారెంట్‌లో కూర్చుని పిజ్జా-బర్గర్ తింటారని ఆరోపించారు. శీతల పానీయాలు తాగుతారు. ఇలాంటివే మన రోగనిరోధక శక్తిని పాడు చేస్తాయన్నారు. రోగనిరోధక శక్తి బలోపేతం కావాలంటే ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినాలని షోయబ్ చెప్పారు. యాంటీ బయోటిక్ మందులు వాడకూడదని షోయబ్ తెలిపారు. 

Updated Date - 2020-03-26T17:46:35+05:30 IST