లేడీస్ హాస్టల్‌‌ను సందర్శించిన ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2020-03-30T19:52:49+05:30 IST

కరోనా తీవ్రతను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలను సమీక్షిచేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారంనాడు భోపాల్‌లోని..

లేడీస్ హాస్టల్‌‌ను సందర్శించిన ముఖ్యమంత్రి

భోపాల్: కరోనా తీవ్రతను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలను సమీక్షిచేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారంనాడు భోపాల్‌లోని ఐఐటీ మహిళా హాస్టల్‌ను సందర్శించారు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించిన సీఎం అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. 'మీరు కూడా మీ బంధువులు, మిత్రులకు ఫోన్ చేసి లాక్‌డౌన్‌‌ రూల్స్‌తో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పండి. మరి కొద్ది రోజుల్లోనే మనం కరోనా వైరస్‌పై విజయం సాధిస్తామని నేను విశ్వసిస్తున్నాను' అని శివరాజ్ సింగ్ విద్యార్థులతో పేర్కొన్నారు.


'ఇతర దేశాలతో పోల్చుకుంటే మన ప్రయత్నాల కారణంగా మరీ అంతగా కరోనా వైరస్ వ్యాప్తి కాలేదు. మరి కొన్ని రోజులు పోరాటం కొనసాగిస్తే కరోనాపై విజయం మనదే అవుతుంది' అని విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపారు.


కాగా, మధ్యప్రదేశ్‌లో కొత్తగా మరో 8 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఇండోర్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ డీన్ సోమవారంనాడు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-03-30T19:52:49+05:30 IST