కమల్‌నాథ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ‘మౌనదీక్ష’ కు దిగిన సీఎం శివరాజ్

ABN , First Publish Date - 2020-10-19T17:07:53+05:30 IST

మంత్రి ఇమార్తి దేవీపై మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ వ్యాఖ్యలను నిరసిస్తూ సీఎం శివరాజ్ సింగ్ ‘మౌనదీక్ష’ కు దిగారు. భోపాల్ లో రెండు

కమల్‌నాథ్ వ్యాఖ్యలను నిరసిస్తూ ‘మౌనదీక్ష’ కు దిగిన సీఎం శివరాజ్

లక్నో : మంత్రి ఇమార్తి దేవీపై మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ వ్యాఖ్యలను నిరసిస్తూ సీఎం శివరాజ్ సింగ్ ‘మౌనదీక్ష’ కు దిగారు. భోపాల్ లో రెండు గంటల పాటు మౌన దీక్ష చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ‘‘కమల్‌నాథ్ వ్యాఖ్యలను నిరసిస్తూ రెండు గంటల పాటు భోపాల్‌లో మౌనదీక్ష చేపడుతున్నాను’’ అని సీఎం శివరాజ్ ప్రకటించారు.


మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ మహిళా మంత్రి ఇమార్తి దేవీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివరాజ్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ఇమార్తి దేవీని ‘ఐటమ్’ అని కమల్‌నాథ్ సంబోధించారు. దీంతో ఒక్కసారిగా ఆయనపై రాజకీయ దాడి మొదలైంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ‘దబ్రా’ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో కమల్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఇక్కడి నుంచి సురేశ్ రాజే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈయన చాలా సాదాసీదా వ్యక్తి. ఆమె లాగా కాదు. ఆమె పేరేమి? నా కంటే మీకే బాగా తెలుసు ఆమె గురించి. ఆమె ఐటమ్’’ అంటూ కమల్‌నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2020-10-19T17:07:53+05:30 IST