నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళమిచ్చిన శివసేన ప్రజా ప్రతినిధులు
ABN , First Publish Date - 2020-03-27T23:49:46+05:30 IST
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నామని
ముంబై : కరోనా మహమ్మారిని అరికట్టేందుకు శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నామని పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఈ ఫండ్ ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘కరోనాను అధిగమించేందుకు మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటిస్తున్నాం. ముఖ్యమంత్రి ఉద్ధవ్ సారథ్యంలో కరోనాపై విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉంది.’’ అని రౌత్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరోవైపు ఎన్సీపీ ప్రజాప్రతినిధులు కూడా నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నారు. ఇక, మహారాష్ట్ర గవర్నర్ కోషియారీ కూడా నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించారు.