కాంగ్రెస్‌ పార్టీపై శివసేన ప్రశంసలు

ABN , First Publish Date - 2020-12-19T07:01:13+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. 1971 యద్ధంలో అప్పటి ప్రభుత్వం అనుసరించిన తీరును పొగడ్తలతో ముంచెత్తింది.

కాంగ్రెస్‌ పార్టీపై శివసేన ప్రశంసలు

చరిత్రను తిరగేయాలని బీజేపీకి సూచించిన సామ్నా


ముంబై, డిసెంబరు 18: కాంగ్రెస్‌ పార్టీపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. 1971 యద్ధంలో అప్పటి ప్రభుత్వం అనుసరించిన తీరును పొగడ్తలతో ముంచెత్తింది. 1971 యుద్ధంలో కాంగ్రెస్‌ పాత్ర గురించి ప్రశ్నించే వారు ఒకసారి చరిత్ర పుటలను తిరగేయాలని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌లు ఇంకా సమస్యలు సృష్టిస్తూనే ఉన్నాయని  శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ సంపాదకీయం పేర్కొంది. 70 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం సాధించిందని అడిగే వారు ముందుగా 1971 యుద్ధం చారిత్రక ఘట్టాలను తిరగేయాలని సామ్నా సంపాదకీయం సూచించింది.

Read more