పార్లమెంటు సమావేశాలకు శివసేన ఎంపీలు హాజరుకారు...

ABN , First Publish Date - 2020-03-23T11:59:43+05:30 IST

ఢిల్లీలో సోమవారం జరగనున్న పార్లమెంటు సమావేశాలకు తమ శివసేన పార్టీ ఎంపీలు హాజరుకారని ఆ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చెప్పారు...

పార్లమెంటు సమావేశాలకు శివసేన ఎంపీలు హాజరుకారు...

సంజయ్‌రౌత్ ట్వీట్ 

ముంబై : ఢిల్లీలో సోమవారం జరగనున్న పార్లమెంటు సమావేశాలకు తమ శివసేన పార్టీ ఎంపీలు హాజరుకారని ఆ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చెప్పారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు హాజరు కారాదని తమ పార్టీ అధినేత, సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నారని ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. దేశంలో కొవిడ్-19 పాజిటివ్ రోగుల సంఖ్య 396కు చేరుకుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రకటించిన నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలకు శివసేన ఎంపీలు దూరంగా ఉండాలని నిర్ణయించారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు శివసేన సర్కారు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 

Updated Date - 2020-03-23T11:59:43+05:30 IST